News

Realestate News

ఆనంద వారాంతం!

Happy Weekend

ఆనంద వారాంతం!
ఈనాడు, అమరావతి

విజయవాడ(Happy Weekend)పుస్తక మహోత్సవం ఏడు రోజులు పూర్తి చేసుకుంది. మరో నాలుగు రోజులు మాత్రమే ప్రదర్శన నిర్వహించనున్న క్రమంలో శనివారం సాయంత్రం పుస్తకాభిమానుల సంఖ్య అధికమైంది. నేడు ఆదివారం కావడంతో మరింత ఎక్కువ మంది ప్రదర్శనను సందర్శించే అవకాశం ఉంది. ఉదయం నుంచి రకరకాల సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. మధ్యాహ్నం 2గంటల నుంచి ప్రదర్శన ప్రారంభమై రాత్రి 9గంటల వరకూ కొనసాగనుంది. ప్రాంగణంలో వందల స్టాళ్లు ఉండడం వల్ల అన్నింటినీ చూడాలంటే కనీసం రెండు గంటల పైనే పడుతుంది. అందుకే ఏ విభాగానికి ఆ విభాగం చూసుకునేలా ప్రణాళికతో వెళ్లడం మంచిది. సాహిత్యం, చిన్నారులు, సాంకేతికత, ఆధ్యాత్మికం.. వీటన్నింటిలో ఏ పుస్తకాలపై ఆసక్తి ఉంటే వాటిని చూడాలనుకునే వాళ్లు స్టాల్‌ నెంబర్లను వెతుక్కుని నేరుగా వెళ్లి పుస్తకాలను కొనుగోలు చేసుకుంటే సమయం కలిసొస్తుంది. ప్రతి స్టాల్‌లోనూ కచ్చితంగా పది శాతం రాయితీ ఇస్తున్నారు.