News

Realestate News

తెలుగుభాషకు నిజమైన బ్రహ్మోత్సవం

తెలుగుభాషకు నిజమైన బ్రహ్మోత్సవం

ఘంటసాల, నాగాయలంక: శ్రీకాకుళంలో శ్రీకృష్ణ దేవరాయ మహోత్సవాల్లో భాగంగా తెలుగుభాషా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా ప్రేమికులు, సాహితీవేత్తలు తరలి రావటం తెలుగుభాషకు నిజమైన బ్రహ్మోత్సవం అని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగు భాష బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఆయన ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధికి, వికాసానికి కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2018వ సంవత్సరాన్ని తెలుగు భాష వికాస సంవత్సరంగా ప్రకటించి సంవత్సరం మొత్తం కార్యక్రమాలు జరిగేలా ప్రణాళికలు రూపొందించడం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యతలో భాగమని పేర్కొన్నారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సృజనాత్మకత, సంస్కృతి సమితీ ముఖ్య కార్యదర్శి దీర్ఘాసి విజయభాస్కర్‌ దివిసీమలోని చారిత్రక నేపథ్యాన్ని ఒక పుస్తక రూపంలోకి తీసుకురావటంతో పాటు గేయాన్ని రూపొందించాలని మంత్రి ఉమా కోరారు. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా తెలుగు భాషా వికాసం కోసం జరుగుతున్న కృషిని అభినందించి తన పాటలతో ఆహూతులను అలరించారు. ఈ సందర్భంగా కాసుల పురుషోత్తమ కవి జ్ఞాపకార్థం ఆయన వారసులు రూపొందించిన డైరీని అతిథులు ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *