News

Realestate News

నజరానాల్లోనూ జిల్లాకు అగ్రస్థానం

District najaranallonu top

నజరానాల్లోనూ జిల్లాకు అగ్రస్థానం
నగదురహిత లావాదేవీల్లో బహుమతుల వెల్లడి

గంపలగూడెం, న్యూస్‌టుడే: నగదు రహిత లావాదేవీల నిర్వహణలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న కృషా ్ణజిల్లా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాలు అందుకోవడంలో కూడా అగ్రస్థానంలోనే ఉంది. గత ఏడాది నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం డిసెంబరు నుంచి నగదు రహిత లావాదేవీలు కూడా అమల్లోకి తీసుకువచ్చింది. నగదు రహిత లావాదేవీలు నిర్వహించే వారిని ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ నగదు బహుమతులు కూడా గత నెలలోనే ప్రకటించారు. రూ.వెయ్యి నుంచి రూ.కోటి వరకు బహుమతులు ప్రకటించారు. నగదు బహుమతులు గెలుచుకునేందుకు నగదు రహిత లావాదేవీలు నిర్వహించే వారిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు. తాజాగా బహుమతులు అందుకోవడంలోనూ జిల్లా అగ్రస్థానంలోనే ఉందని కలెక్టర్‌ బాబు గురువారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15వేల మంది ఇప్పటి వరకు లాటరీ ద్వారా రూ.వెయ్యి చొప్పున బహుమతులు దక్కించుకోగా ఒక్క కృష్ణా జిల్లాలోనే 5,200వేల మందికి నగదు బహుమతులు వచ్చాయన్నారు. జిల్లాకు సంబంధించి 3వేల మంది పింఛన్‌దారులకు, 2200 మంది రేషన్‌ కార్డుదారులకు ఇప్పటి వరకు రూ.వెయ్యి చొప్పున నగదు బహుమతులు వారి బ్యాంక్‌ ఖాతాలకు జమయ్యాయి. విజయవాడలో నలుగురు వ్యాపారులకు రూ.50వేల చొప్పున బహుమతులు అందగా వారిలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని సీఎం సహాయ నిధికి అందజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఏప్రిల్‌ వరకు బహుమతుల పంపిణీ కొనసాగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *