News

Realestate News

భూముల యాజమాన్య హక్కుల పరిశీలన

భూముల యాజమాన్య హక్కుల పరిశీలన

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే(The observation of the rights of land ownership): ఆరు నెలలుగా నిలిచిన దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం నివాసం ఉంటున్న వారి యాజమాన్య హక్కుల పరిశీలనకు ఆలయాల అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. పాత రికార్డుల్లో ఆలయ భూములుగా నమోదై ఉన్న స్థలాల్లోని ఇళ్ల యజమానుల వద్దకు వెళ్లి వారికి ఆ భూమిపై ఉన్న హక్కులు, వారివద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి నమోదు చేస్తున్నారు. నివేదిక సిద్ధం చేయడం కోసం ఈ పరిశీలన చేస్తున్నట్లు స్థానిక రంగనాయకస్వామి, చంద్రమౌళీశ్వరస్వామి ఆలయాల ఈవో ధూళిపాళ సుబ్రమణ్యం తెలిపారు.