News

Realestate News

శేషవాహనంపై స్వామి గ్రామోత్సవం

శేషవాహనంపై స్వామి గ్రామోత్సవం
మోపిదేవి,న్యూస్‌టుడే: మోపిదేవిలో కొనసాగుతున్న శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాల రెండోరోజైన సోమవారం శ్రీదేవసేనా అమ్మవారితో శేషవాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కార్తికేయుడు ముగ్దమనోహరరూపంలో దర్శనమిస్తూ భక్తుల నుంచి మంగళహారతులు స్వీకరించారు. గ్రామోత్సవాన్ని ఆలయసహాయ కమిషనర్‌ ఎం.

శారదాకుమారి ప్రారంభించారు. ఉదయం నిత్యపూజలతో పాటు బలిహరణ, వాస్తుపూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులతోపాటు చల్లపల్లి ఎస్టేట్‌ దేవాలయాల పర్యవేక్షకులు, సహాయ అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

నేడు రథోత్సవం : ఉత్సవాల మూడోరోజైన మంగళవారం రాత్రి 8గంటలకు స్వామివారిని విద్యుత్తు దీపకాంతులతో ఏర్పాటుచేసిన రథంపై ఊరేగిస్తామన్నారు.