News

Realestate News

సుందరంగా ఇంద్రకీలాద్రి

Indrakiladri

సుందరంగా ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే(Indrakiladri): రాజధాని నగరంలో కీలకమైన ఇంద్రకీలాద్రిని సుందరంగా తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ అన్నారు. ఇంద్రకీలాద్రి చెంత సోమవారం దివ్యదర్శనం పథకాన్ని ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంద్రకీలాద్రిపై గతంలో తొగించిన అన్నదాన భవనం, శివాలయ మార్గంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు.

అన్నదాన భవనం సమీపంలోని వాటరు ట్యాంకు కొండ ప్రాంతాన్ని పచ్చదనంతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. నటరాజస్వామి ఆలయం, మల్లేశ్వరాలయాలను సైతం అందంగా తీర్చిదిద్దాలని కోరారు. దుర్గా కల్యాణ మండపాన్ని పూర్తిగా తొలగించాలని సూచించారు. ఆర్జేసీ చంద్రశేఖర్‌ అజాద్‌, దుర్గగుడి ఈఈ భాస్కర్‌, ఏఈవో అచ్యుతరామయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *