News

Realestate News

హోరా హోరీగా బాస్కెట్‌ బాల్‌ పోటీలు

హోరా హోరీగా బాస్కెట్‌ బాల్‌ పోటీలు

నూజివీడు, న్యూస్‌టుడే : రాజా వెంకటాద్రి అప్పారావు స్మారక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జిల్లాల ఓపెన్‌ బాస్కెట్‌ బాల్‌ పోటీలు నూజివీడు డీఏఆర్‌ కళాశాలలో హోరా హోరీగా సాగుతున్నాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ పోటీలు మంగళవారం మూడో రోజుకు చేరుకున్నాయి. 42 పురుషులు, 12 మహిళలు, 12 సబ్‌ జూనియర్ల జట్లతో మొత్తం 66 జట్లు ఆడుతున్నాయి. పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన భోపాల్‌ జట్టు అసోసియేషన్‌ అనుమతితో ఆడుతోంది. సబ్‌ జూనియర్స్‌, మహిళల విభాగాల్లో నూజివీడు క్రీడాకారుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే సబ్‌జూనియర్స్‌ విభాగంలో నూజివీడు కుమార్‌ ఆంగ్లమాధ్యమ పాఠశాల, ఎస్‌ఆర్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి.

బుధవారం ఈ రెండు జట్లు ఫైనల్స్‌ ఆడతాయి. మొదటి సెమీ ఫైనల్స్‌లో నూజివీడు వీటీహెచ్‌ జట్టుపై నూజివీడు కుమార్‌ స్కూల్‌ 14-29 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఏక పక్షంగా సాగిన రెండో సెమీఫైనల్సË్లో నూజివీడు ఎస్‌ఆర్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల జట్టు హైదరాబాద్‌ డాన్‌బాస్కో జట్టును 42-14 పాయింట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో డాన్‌ బాస్కో, గుంటూరు జట్ల మధ్య 24-24 పాయింట్లతో టై కాగా అదనపు సమయంలో డాన్‌బాస్కో జట్టు గుంటూరును 28-24 స్కోరుతో ఓడించింది.

మహిళల విభాగంలో నూజివీడు సెయింట్‌ ఆన్స్‌ జట్టు నూజివీడు ఏబీఏ(ఆక్రో బాస్కెట్‌బాల్‌) జట్టును 42-34తో ఓడించింది. నూజివీడు ఏబీఏ జట్టు విశాఖ లిటిల్‌ ఏంజల్స్‌ జట్టును 35-20, గుంటూరు జీఎస్‌సీ జట్టు విశాఖ వీబీఏ జట్టును 31-20, విశాఖ వీబీఏ జట్టు, సీబీఏ విజయవాడను 27-17 స్కోరుతో ఓడించాయి. వీటీహెచ్‌ జట్టుపై సీబీఏ రాజమండ్రి 9-18, వీటీహెచ్‌ను కేఎస్‌పీఆర్‌ఎస్‌ జట్టు 05-27 పాయింట్ల తేడాతో ఓడించాయి. సీబీఏ రాజమండ్రి జట్టు సీబీపీఏ గుంటూరుపై 32-16, కేఎస్‌పీఆర్‌ఎస్‌ జట్టు గుంటూరు సీబీపీఏను 23-17 పాయింట్ల తేడాతో ఓడించాయి.

నువ్వా… నేనా..?
పురుషుల విభాగంలో పోటీలు నువ్వా..నేనా అన్నట్లు సాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు ఈ విభాగంలో మొత్తం 42 మ్యాచ్‌లు నిర్వహించారు. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటిని పరిశీలిస్తే ఆర్సీపురం టోర్నమెంట్‌ను గెలుచుకుని ప్రత్యేక అనుమతితో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఈఎంఐ జట్టు వైజాగ్‌ ఎన్‌ఎస్‌ఎ జట్టును 44-24 పాయింట్ల తేడాతో అవలీలగా గుడివాడ బి జట్టును 49-10 పాయింట్ల తేడాతో ఓడించింది. హోరాహోరీగా జరిగిన 161 ఆర్టిలరీ, సీబీపీఏ గుంటూరు-ఎ ను 25-23 పాయింట్ల తేడాతో ఓడించింది. గుంటూరు-ఎ జట్టు ప్రొద్దుటూరు జట్టును 39-18 స్కోరుతో ఓడించింది. గుడివాడ, ఏఏఏ-గుంటూరు జట్ల మధ్యహోరా హోరీగా సాగిన మరో మ్యాచ్‌లో గుంటూరు, గుడివాడను 31-30 స్కోరుతో ఓడించింది.