News

Realestate News

నేడు జ్యోతిరావు పూలె వర్థంతి

నేడు జ్యోతిరావు పూలె వర్థంతి

Jyotirao Poole Today Death Anniversary

నేడు జ్యోతిరావు పూలె వర్థంతి

ముఖ్యఅతిధి సిఎం జగన్‌

విజయవాడ

జ్యోతిరావుపూలె వర్ధంతిని గురువారం రాష్ట్రంలో ఘనంగా నిర్వహించనున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి మంత్రి ఎం.శంకరనారాయణ పేర్కొన్నారు. దీనిలో భాగంగా స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. కళాక్షేత్రంలో ఏర్పాట్లను మంత్రి శంకరనారాయణ, శాసన సభ్యులు పార్థసారథి, జోగి రమేష్‌, మల్లాది విష్ణు, ప్రభుత్వ సలహాదారు తలశిల రఘురామ్‌ బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ సిఎం జగన్‌ చేపడుతున్న అభివద్ధి సంక్షేమ పథకాలు బడుగు, బలహీన వర్గాలకు అందించేందుకు చట్టబద్దత కల్పించినట్లు తెలిపారు. రాజ్యాంగపరంగా, చట్టపరంగా నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిసూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలిచారన్నారు. శాసన సభ్యులు కొలుసు పార్థసారథి చూట్లాడుతూ బలహీనవర్గాలు, దళితులు, మైనారిటీలు చదివే స్కూళ్లల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టడం ఓ విప్లవాత్మకమైన నిర్ణయమన్నారు. బలహీన వర్గాల ప్రజలు పెద్దఎత్తున వచ్చి జ్యోతిరావుపూలే వర్థంతిని విజయవంతం చేయాలన్నారు. సిఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టరు డాక్టర్‌ మాధవీలత, డిసిపి విక్రాంత్‌ పాఠిల్‌, సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం.ధ్యాన చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *