News

Realestate News

నేడు ఇంద్రకీలాద్రిపై ‘విజయీభవ’

నేడు ఇంద్రకీలాద్రిపై ‘విజయీభవ’ ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: సరస్వతి దేవి జన్మదినమైన శ్రీపంచమిని పురస్కరించుకొని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ‘విజయీభవ’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22న (నేడు) ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను విద్యార్థుల కోసం సరస్వతి దేవిగా అలంకారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత ఏడు సంవత్సరాలుగా సరస్వతి దేవి జన్మదినమైన…

Read more

హోరా హోరీగా బాస్కెట్‌ బాల్‌ పోటీలు

హోరా హోరీగా బాస్కెట్‌ బాల్‌ పోటీలు నూజివీడు, న్యూస్‌టుడే : రాజా వెంకటాద్రి అప్పారావు స్మారక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జిల్లాల ఓపెన్‌ బాస్కెట్‌ బాల్‌ పోటీలు నూజివీడు డీఏఆర్‌ కళాశాలలో హోరా హోరీగా సాగుతున్నాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ పోటీలు మంగళవారం మూడో రోజుకు చేరుకున్నాయి. 42 పురుషులు, 12 మహిళలు, 12…

Read more

పల్లె వాకిట ఇలా వ్యాపారం

పల్లె వాకిట ఇలా వ్యాపారం ప్రోత్సాహకాలుఅందిస్తున్న ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలువినియోగించుకుంటున్న యువత ఇప్పటివరకు పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థల సేవలు తమ పరిధిని పెంచుకుంటున్నాయి. ఆయా సంస్థలు గ్రామాల్లో యువకులను విక్రయదారులుగా (సెల్లర్లు).. ప్రచారకర్తలుగా (ప్రమోటర్లు) నియమించుకొని తమ సేవలను విస్తరించుకుంటున్నాయి. ఆ సేవలు అందించేందుకు కొంత మొత్తంలో వారికి ప్రోత్సాహకాన్ని అందిస్తున్నాయి.…

Read more

అంగరంగ వైభవంగా అమ్మవారి ఆగమనం

అంగరంగ వైభవంగా అమ్మవారి ఆగమనం జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: వందేళ్లకు పైగా కొనసాగుతున్న ఒక సంస్కృతి.. ప్రసిద్ధ పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రం నుంచి రెండేళ్లకోసారి మూలమూర్తులు జగ్గయ్యపేట పట్టణానికి తరలివచ్చే ఆనవాయితీ… ఈ నేపథ్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగిన అమ్మవారి ఆగమనం పట్టణ వాసులకు కనువిందు చేసింది. ఉదయం 11 గంటలకు చిల్లకల్లు మీదుగా పట్టణ శివార్లలోకి…

Read more

లక్షణంగా స్థల యోగం

లక్షణంగా  స్థల యోగం జన్మభూమి దరఖాస్తులకు మోక్షం క్రమబద్ధీకరణ అర్జీదారులకు అవకాశం కార్యాచరణ దిశగా అధికారుల కసరత్తు న్యూస్‌టుడే-కలెక్టరేట్‌ ప్రతి నిరుపేదకు సొంతిల్లు ఓ కల. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వీటిల్లో మిగిలిన వాటి పరిస్థితి ఫర్వాలేదనిపిస్తున్నా, గూడు విషయంలో మాత్రం ఆశించిన లక్ష్యాలు…

Read more

భువికి దిగివచ్చిన వైభవమే దివిసీమ శతకం

భువికి దిగివచ్చిన వైభవమే దివిసీమ శతకం ప్రవచన సార్వభౌమ చాగంటి కోటేశ్వరరావు అవనిగడ్డ, న్యూస్‌టుడే: ఆకాశం నుంచి భువికి దిగివచ్చిన దివిసీమ వైభవమే దివిసీమ శతకమని ప్రవచన సార్వభౌమ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన దివిసీమ శతకాన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మంగళవారం సాయంత్రం ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. కోనసీమ, రాయలసీమలలో…

Read more

పుస్తక పండగొచ్చింది

పుస్తక పండగొచ్చింది ఈనాడు- విజయవాడ విజయవాడలో ఏటా జనవరి నెలలో రెండు పండగలు ఉంటాయి. ఒకటి సంక్రాంతి అయితే.. అంతకంటే ముందొచ్చే మొదటి పండగ విజయవాడ పుస్తక మహోత్సవం. గత 28 ఏళ్లుగా నిర్విరామంగా ఏర్పాటు చేస్తున్న పుస్తక మహోత్సవంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రచురణకర్తలు, నిర్వాహకులు పాల్గొంటున్నారు. ఈసారి 29వ విజయవాడ పుస్తక…

Read more

ఆర్థిక గమనం.. అజరామరం..!

ఆర్థిక గమనం.. అజరామరం..! తరలివచ్చిన ఆర్థికరంగ నిపుణులు ఆర్థికరంగం బలోపేతమే లక్ష్యంగా చర్చలు సందేహాలు నివృత్తి చేసుకున్న విద్యార్థులు సందడిగా ‘నాగార్జున’ విశ్వవిద్యాలయం ఈనాడు-అమరావతి దేశ ఆర్థిక రంగం ఉజ్వల భవిష్యత్‌కు దిశా, నిర్దేశం చేయటానికి ఈరంగంలో నిష్ణాతులైన ప్రపంచ ఆర్థిక నిపుణుల బృందం తరలివచ్చింది. అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న పరిశోధక విద్యార్థుల నుంచి ఔపోసన…

Read more

‘గిరిజన విద్యార్థులకు ప్రత్యేక స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి’

‘గిరిజన విద్యార్థులకు ప్రత్యేక స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి’ కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని గిరిజన నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సంబంధించి రాజధానిలో ప్రత్యేక స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని జాతీయ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్‌ అన్నారు. కరెన్సీనగర్‌లోని కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన యువత ప్రైవేటు…

Read more

జాతీయ రోయింగ్‌ పోటీలో సీతామహాలక్ష్మికి కాంస్యం

జాతీయ రోయింగ్‌ పోటీలో సీతామహాలక్ష్మికి కాంస్యం అవనిగడ్డ, న్యూస్‌టుడే: జాతీయ స్థాయిలో మహారాష్ట్రలోని పూనెలో నిర్వహించిన రోయింగ్‌ పోటీల్లో స్థానిక విద్యా వికాస్‌ పూర్వ విద్యార్థిని దాసరి సీతామహాలక్ష్మి కాంస్య పతకం సాధించింది. ఈనెల 6 నుంచి 10 వరకు జరిగిన 36వ సీనియర్‌ జాతీయ రోయింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని ఈ పతకం అందుకుంది.…

Read more